Pranab Mukherjee: ప్రణబ్‌ ముఖర్జీ ఫొటోను మార్ఫింగ్‌ చేసిన వైనం.. మండిపడ్డ ఆయన కూతురు

  • నిన్న ఆరెస్సెస్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణబ్‌
  • ఓ మార్ఫింగ్‌ ఫొటో హల్‌చల్‌
  • ఇటువంటి ట్రిక్స్‌ చేస్తారనే ఊహించానన్న శర్మిష్ట ముఖర్జీ

నిన్న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) కార్యక్రమానికి హాజరయిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సంబంధించి ఓ మార్ఫింగ్‌ ఫొటో హల్‌చల్‌ చేస్తోంది. ఆరెస్సెస్ కార్యకర్తలు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రణబ్‌ ముఖర్జీ కూడా వారిలాగే కుడి చేతిని ఎత్తి ఛాతి వరకు ఉంచినట్లు ఆ ఫొటో ఉంది. అంతేగాక, ఆయన ఆరెస్సెస్‌ టోపీ కూడా ధరించినట్లు అందులో ఉంది. అయితే, ప్రణబ్ మాత్రం సాధారణంగానే నిలిచి ఉన్నారు.. తలపై ఎటువంటి టోపీ ధరించలేదు.

ఈ విషయాన్ని గుర్తించిన ప్రణబ్‌ కుమార్తె, కాంగ్రెస్‌ నాయకురాలు శర్మిష్ట ముఖర్జీ ఇలాంటిది జరుగుతుందని తాను ముందే తన తండ్రికి చెప్పానని బీజేపీపై ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటివి చేస్తారనే తాను భయపడ్డానని, తన తండ్రి మాట్లాడి కొన్ని గంటలైనా కాకముందే ఇటువంటి ట్రిక్స్‌ చేస్తూ అసత్య ప్రచారం చేశారని ఆమె అన్నారు.

Pranab Mukherjee
rss
Congress
morphing
  • Loading...

More Telugu News