indraganti: చైతూతో సినిమా చేస్తానంటున్న ఇంద్రగంటి

  • 'సమ్మోహనం' సక్సెస్ అవుతుంది  
  • చైతూ కోసం ఒక కథను రెడీ చేస్తాను 
  • త్వరలోనే ఆయనకి ఆ కథను వినిపిస్తాను 

మొదటినుంచి కూడా మోహనకృష్ణ ఇంద్రగంటి వైవిధ్యభరితమైన కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. ఆయన తెరకెక్కించిన 'అష్టా చమ్మా' .. 'అమీతుమీ' .. 'జెంటిల్ మేన్' సినిమాలు అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'సమ్మోహనం' .. ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. 'సమ్మోహనం' సినిమా గురించిన విశేషాలను పంచుకుంటూనే, నాగచైతన్య గురించి ప్రస్తావించారు. "చైతూ కోసం నేను ఒక కథను సిద్ధం చేసుకున్నాను. అయితే ఆ కథ ప్రస్తుతం చైతూ చేస్తోన్న 'సవ్యసాచి' కథకి దగ్గరగా ఉండటంతో పక్కన పెట్టేశాను. చైతూ కోసం మరో కథను సిద్ధం చేసి .. త్వరలోనే ఆయనకి వినిపిస్తాను. చైతూతో తప్పకుండా ఒక సినిమా చేసి తీరుతాను" అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక 'సమ్మోహనం' సక్సెస్ పై ఇంద్రగంటి నమ్మకాన్ని ఆ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.     

indraganti
chaitu
  • Loading...

More Telugu News