ramana deekshitulu: పొట్ట నింపుకోవడానికి అన్య మతస్తుడైన జగన్ ఇంటికే వెళ్లాలా?: రమణ దీక్షితులుపై బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఫైర్
- బంగారాన్ని ముంబైకి తరలించి 40 శాతం తరుగు చూపించారు
- అర్చకులను వేధించిన ఘనత ఆయనది
- కుట్ర రాజకీయాలకు సహకరిస్తే.. బ్రాహ్మణులే బుద్ధి చెబుతారు
తిరుమల దేవస్థానం మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుపై ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఆనందసూర్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కళ్యాణమస్తు కోసం స్వామివారి బంగారాన్ని ముంబైకి తరలించి... 40 శాతం తరుగు చూపించారంటూ రమణ దీక్షితులుపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంలో అప్పటి టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి వెయ్యి కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు.
సంపంగి ప్రాకారంలోని వంటశాలలో నైవేద్యం చేయవచ్చని రమణ దీక్షితులు లేఖ ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. అర్ధరాత్రి, మిట్ట మధ్యాహ్నం డ్యూటీలతో అర్చకులను వేధించిన ఘనత రమణ దీక్షితులుదని మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాల్లో భాగస్వామిగా మారి... రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు సహకరిస్తే బ్రాహ్మణులే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పొట్ట నింపుకోవడానికి అన్యమతస్తుడైన వైసీపీ అధినేత జగన్ ఇంటికే వెళ్లాలా? అంటూ మండిపడ్డారు.