Chandrababu: ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్నుతారు.. తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలి: మేకపాటి

  • స్వార్థం కోసం ప్రత్యేక హోదాను బలి చేశారు
  • ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధం
  • జగన్ లోని సంకల్పబలం, ధైర్యాన్ని దగ్గర నుంచి చూశా

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్నుతారని... వాటిని తిప్పికొట్టేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఓటర్ల లిస్టులో అక్రమాలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. అప్పటి కేంద్ర మంత్రి చిదంబరంతో చీకటి చర్చలు జరిపి రాష్ట్రాన్ని విడగొట్టింది చంద్రబాబేనని ఆరోపించారు.

ఏపీకి జీవనాడి అయిన ప్రత్యేక హోదాను తన స్వార్థం కోసం చంద్రబాబు బలిపెట్టారని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ మాత్రం రాష్ట్ర భవిష్యత్తునే ఆకాంక్షించారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తాము పదవులకు రాజీనామాలు చేశామని... ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జగన్ లోని సంకల్పబలం, ధైర్యాన్ని తాను దగ్గర నుంచి చూశానని... అందుకే మొదటి నుంచి ఆయన అడుగుజాడల్లో తాను నడుస్తున్నానని చెప్పారు. 

Chandrababu
Jagan
mekapati rajamohan reddy
  • Loading...

More Telugu News