Balakrishna: చిలమత్తూరు టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ

  • పంచాయతీల వారీగా సమీక్ష నిర్వహించిన బాలయ్య
  • నేతలు, కార్యకర్తలు కలసి పనిచేయాలంటూ సూచన
  • పార్టీకి చెడ్డ పేరు తెస్తే విశ్వరూపం చూస్తారంటూ వార్నింగ్

ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయిందని... ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే సహించబోనంటూ చిలమత్తూరు మండల టీడీపీ నేతలకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. హిందూపురంలో చిలమత్తూరు మండలం నేతలతో పంచాయతీల వారీగా ఆయన సమీక్షలు జరిపారు.

ఈ సందర్భంగా గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు, పెండింగ్ పనుల గురించి నేతలు బాలయ్యకు వివరించారు. పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఉన్నా తమకు సరైన గుర్తింపు లభించడం లేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులను సర్పంచులు, ఎంపీటీసీలే పంచుకుంటున్నారని... కార్యకర్తల మంచిచెడ్డలు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, ఇకపై క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిపోయినదాన్ని నేతలు, కార్యకర్తలు మరచిపోవాలని... ఇకపై అందరూ కలసి పనిచేయాలని సూచించారు. లేకపోతే తన విశ్వరూపం చూస్తారని హెచ్చరించారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకుండా పని చేయాలని... లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.

Balakrishna
hindupur
chilamathur
warning
  • Loading...

More Telugu News