suman: గాడ్ ఫాదర్ లేకుండా ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా వుంది: సుమన్

  • నటుడిగా 40 యేళ్లు పూర్తి చేశాను 
  • ఇంతవరకూ 400 సినిమాలు చేశాను 
  • 500 సినిమాలు పూర్తి చేయాలని వుంది

తెలుగు తెరపై యాక్షన్ హీరోగా మాస్ ఆడియన్స్ ను .. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించినవారి జాబితాలో సుమన్ ముందువరుసలో కనిపిస్తారు. అలాంటి సుమన్ నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి 40 సంవత్సరాలను పూర్తిచేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "నటుడిగా 40 సంవత్సరాలను పూర్తిచేసుకోవడం చాలా సంతోషంగా వుంది. తెలుగు .. తమిళ .. కన్నడ .. మలయాళ .. ఒరియా .. భోజ్ పురి భాషల్లో కలిపి ఇంతవరకూ 400 సినిమాలు చేశాను. హీరోగా 99 సినిమాలు చేశాను. 'అన్నమయ్య'లో వేంకటేశ్వరస్వామి పాత్రను .. 'శివాజీ'లో విలన్ పాత్రను ఎప్పటికీ మరిచిపోలేను. గాడ్ ఫాదర్ లేకుండగా ఈ స్థాయి చేరుకోవడం నాకు ఎంతో గర్వంగా వుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు .. అభిమానుల ఆదరణ కారణంగా ఇన్ని సంవత్సరాలు పరిశ్రమలో ఉండగలిగాను. మరో పదేళ్లపాటు పరిశ్రమలో ఉండాలనీ .. 500 సినిమాలు పూర్తిచేయాలని వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  

suman
  • Error fetching data: Network response was not ok

More Telugu News