sudeep: సుదీప్ జోడీగా మడోన్నా సెబాస్టియన్ .. యూరప్ లో షూటింగ్

- సుదీప్ హీరోగా 'కోటిగొబ్బ 3'
- కథానాయికగా మడోన్నా
- ఈ నెల 16 నుంచి రెగ్యులర్ షూటింగ్
కన్నడలో స్టార్ హీరోగా సుదీప్ ఒక వెలుగు వెలుగుతున్నాడు. అక్కడి మాస్ ఆడియన్స్ మనసు దోచేసిన ఆయన, 'కోటిగొబ్బ 3' సినిమా కోసం రెడీ అవుతున్నాడు. గతంలో వచ్చిన 'కోటిగొబ్బ' .. 'కోటిగొబ్బ 2' సినిమాలు ఆయనకి ఘన విజయాలను తెచ్చిపెట్టాయి. అయితే ఆ సినిమాలకి సీక్వెల్ కాకపోయినా, ఆ టైటిల్ కి వచ్చిన క్రేజ్ కారణంగా 'కోటిగొబ్బ 3' సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నారు.
