devineni uma: వంగవీటి రంగా హత్యలో మాస్టర్ ప్లాన్ దేవినేని ఉమాదే!: వసంత నాగేశ్వరరావు

  • జిల్లాలో హత్యా రాజకీయాలను ప్రోత్సహించేది ఎవరో అందరికీ తెలుసు
  • హత్యలు చేసి జైలుకు వెళ్లిన చరిత్ర ఉమ కుటుంబీకులదే
  • ఉమ వదిన ఎలా చనిపోయారో అందరికీ తెలుసు

కృష్ణా జిల్లాలో హత్యలు చేయించేది, హత్యారాజకీయాలను ప్రోత్సహించేది ఎవరో అందరికీ తెలుసని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. వంగవీటి మోహనరంగా హత్యకు మాస్టర్ ప్లాన్ వేసింది మంత్రి దేవినేని ఉమానే అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రోజుకో పార్టీ మారుతూ, ఆస్తుల కోసం హత్యలు చేసే హంతకులంటూ తనపై, తన కుమారుడు కృష్ణప్రసాద్ పై ఉమ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

హత్యలు చేసి జైలుకు వెళ్లిన చరిత్ర ఉమ కుటుంబీకులదే అని అన్నారు. దేవినేని ఉమ వదిన ఎలా చనిపోయారో, అందులో ఎవరి హస్తముందో అందరికీ తెలుసని చెప్పారు. కంచికచర్లలో మీడియాతో మాట్లాడుతూ వసంత నాగేశ్వరరావు ఈ మేరకు ఆరోపణలు గుప్పించారు. జలవనరుల శాఖ మంత్రిగా ఉంటూ కూడా... తనకు రాజకీయంగా జన్మనిచ్చిన వీరులపాడు, కంచికచర్ల మండలాలకు సాగునీరు కూడా ఇవ్వలేని అసమర్థుడు ఉమ అంటూ మండిపడ్డారు.

devineni uma
vasantha nageswara rao
vangaveeti ranga
murder
  • Loading...

More Telugu News