rajanikanth: చెన్నైలో విజయ్ రికార్డును అధిగమించిన రజనీ

- నిన్ననే విడుదలైన 'కాలా'
- రజనీ మార్క్ మూవీగా టాక్
- నెక్స్ట్ మూవీ షూట్ కి రజనీ
రజనీకాంత్ క్రేజ్ ఎప్పుడో ఎల్లలు దాటిపోయింది. ఆయన సినిమా కోసం ఎదురుచూసే అభిమానులు ప్రపంచవ్యాప్తంగా వున్నారు. వివిధ భాషల్లోని స్టార్ హీరోలు సైతం ఆయన సినిమా రిలీజ్ ను చూసుకుని .. తమ సినిమా విడుదలను ప్లాన్ చేసుకుంటారు. అంతగా మార్కెట్ ను ప్రభావితం చేయగల హీరోగా రజనీ కనిపిస్తారు. ఆయన ప్రతి సినిమా ఓపెనింగ్స్ రోజునే కొత్త రికార్డును సృష్టిస్తూ ఉంటుంది. అదే పనిని 'కాలా' కూడా చాలా తేలికగా చేసేసింది.
