Chiranjeevi: చిరంజీవి, పవన్ కల్యాణ్, నానిలపై శ్రీరెడ్డి ఘాటు విమర్శలు

  • నాని రాసలీలలన్నీ బయటపెడతా
  • పలాసలో పవన్ కల్యాణ్ పులస చేపలా ఎగిరెగిరి పడుతున్నారు
  • అన్యాయం, అక్రమాలకు చిరంజీవి బ్రాండ్ అంబాసడర్

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నానిపై నటి శ్రీరెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 'నాని ప్లస్ శ్రీరెడ్డి = డర్టీ పిక్చర్... ఎప్పుడు? కమింగ్ సూన్... ఆన్ ది వే' అంటూ ట్వీట్ చేసింది. నానిగాడి రాసలీలలు అన్నీ బయటపెడతానని... 'కాసుకోర నాని... నీ కాపురంలో నిప్పులే' అంటూ ట్వీట్ చేసింది.

ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా శ్రీరెడ్డి విమర్శలు గుప్పించింది. "పలాసలో పులస చేపలా ఎగిరెగిరి పడుతున్నాడు. అన్యాయం, అక్రమం, దౌర్జన్యాల గురించి మీరే చెప్పాలి. మీ అన్నయ్య వాటికి బ్రాండ్ అంబాసడర్. ఎమ్మెల్యే సీట్లు కొనుక్కున్నవారికి కుచ్చు టోపీ, ఓట్లు వేసిన ప్రజల నోట్లో మట్టి కొట్టారు. నీ బండ పడ. సీఎం అనగానే నీ మొహం చూడాలి. సీఎం సీఎం అని ఇక్కడదాకా లాక్కొచ్చారంట. సినిమాల్లో కోట్లు ఎందుకు వదిలేశావో ఎవరికి తెలియదు నాయనా?" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై పీకే, మెగా అభిమానులు మండిపడుతున్నారు.

Chiranjeevi
Pawan Kalyan
nani
srireddy
tollywood
  • Loading...

More Telugu News