Mahesh Babu: 50 రోజులు పూర్తి .. 'బాహుబలి' తరువాత స్థానంలో 'భరత్ అనే నేను'

- భారీ విజయాన్ని అందుకున్న 'భరత్ అనే నేను'
- మహేశ్ కెరియర్లో 100 కోట్ల షేర్ అందుకున్న తొలి సినిమా
- శాటిలైట్ హక్కుల రూపంలో 22 కోట్లు
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను' తాజాగా 50 రోజులను పూర్తి చేసుకుంది. సందేశంతో కూడిన ఈ సినిమా .. మహేశ్ అభిమానులకు ఎంతో సంతృప్తిని కలిగించింది. నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇటు కొరటాల కెరియర్లోను .. అటు మహేశ్ బాబు కెరియర్లోను చెప్పుకోదగినదిగా నిలిచింది. 200 కోట్ల గ్రాస్ ను సాధించిన ఈ సినిమా .. మహేశ్ బాబు కెరియర్లో 100 కోట్ల షేర్ ను రాబట్టిన తొలిచిత్రంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
