maganti babu: మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తా: మాగంటి బాబు

  • వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయను
  • ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎవరినీ ఇబ్బంది పెట్టదలచుకోలేదు
  • ఎంపీగా  నా గెలుపు ఖాయం

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంపై పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టీడీపీ ఎంపీ మాగంటి బాబు క్లారిటీ ఇచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని, మళ్లీ ఎంపీగానే బరిలోకి దిగుతానని, తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎవరినీ ఇబ్బంది పెట్టదలచుకోలేదని అన్నారు. కాగా, వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా ఈ విషయమై ఇటీవలే మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తాను పోటీచేయనని, ఎంపీగానే బరిలోకి దిగుతానని అన్నారు.

maganti babu
eluru mp
  • Loading...

More Telugu News