modi: 'ఎలా ఉన్నారు? బాగున్నారా?' అంటూ తెలుగులో పలకరించిన మోదీ!

  • పీఎంబీజేపీ లబ్ధిదారులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్
  • ఏపీకి చెందిన లబ్ధిదారుడితో తెలుగులో పలకరింపు 
  • ప్రభుత్వ పథకాలతో బడుగు వర్గాలకు లబ్ధి చేకూరుతోందన్న విజయ్ బాబు

‘విజయ్ బాబూ జీ, ఎలా ఉన్నారు? బాగున్నారా?’ అంటూ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని  ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో పలకరించారు. ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి ప్రయోజన (పీఎంబీజేపీ) పథకం లబ్ధిదారులతో ఢిల్లీ నుంచి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో స్వయంగా మోదీ  మాట్లాడారు.

 ఆంధ్రప్రదేశ్ కు చెందిన కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న విజయ్ బాబుతో మోదీ తెలుగులో కొద్ది సేపు మాట్లాడి ఆశ్చర్యపరిచారు. ‘విజయ్ బాబుజీ! ఎలా ఉన్నారు? బాగున్నారా?’ అని మోదీ ప్రశ్నించారు.

ఇందుకు విజయ్ బాబు స్పందిస్తూ, ‘నాకు డయాలసిస్ మూడేళ్లుగా జరుగుతోంది. ముప్పై ఏళ్లుగా నాకు బీపీ కూడా ఉంది. ఒక ఏడాది పాటు ప్రైవేటు ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటే చాలా ఖర్చయింది సార్. మీరు ఈ స్కీమ్ పెట్టిన అప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకుంటున్నా. ట్రీట్ మెంట్ బాగా చేస్తున్నారు. ఇప్పుడు కేవలం మందులకు మాత్రమే ఖర్చు అవుతోంది. జనౌషధిలో మందులు కొనుగోలు చేస్తున్నాను. నా ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. ప్రభుత్వం ఉచితంగా డయాలసిస్ అందించకపోతే బడుగు వర్గాల వాళ్లు చాలామంది చనిపోయేవాళ్లు. మీరు పెట్టిన స్కీమ్స్ చాలా బాగున్నాయి’ అని చెప్పారు.

ఇందుకు మోదీ స్పందిస్తూ, ‘ఈ పథకం ద్వారా మిగులుతున్న డబ్బును మంచిగా వాడుకోండి. మీ పిల్లలు, అమ్మాయిల చదువులకు వాడుకుంటారుగా!’ అన్నారు.

  • Loading...

More Telugu News