teju: తేజుకి సినిమా చేసిపెట్టమంటోన్న చిరూ .. పవన్

  • వరుస పరాజయాలతో తేజు 
  • ఆయన కెరియర్ పై దృష్టి పెట్టిన చిరూ 
  • శ్రద్ధ తీసుకుంటోన్న పవన్    

సాయిధరమ్ తేజ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'తేజ్ ఐ లవ్ యూ' సిద్ధమవుతోంది. చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ నెల 9వ తేదీన ఈ సినిమా ఆడియో వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో ఫిల్మ్ నగర్లో ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో చరణ్ .. బన్నీ ఇద్దరూ కూడా పరాజయాలు ఎదురైనా తమ క్రేజ్ తగ్గని స్థాయికి చేరుకున్నారు.

ఇక వరుణ్ తేజ్ రెండు హిట్లతో జోరుమీదే వున్నాడు. సాయిధరమ్ తేజ్ మాత్రం వరుస పరాజయాలతో సతమతమైపోతున్నాడు. అందువలన తేజుకి హిట్ పడేలా ఒక మంచి కథను సెట్ చేయమని చిరంజీవి .. పవన్ కల్యాణ్ ఇద్దరూ కూడా అల్లు అరవింద్ తో చెప్పారట. దాంతో అల్లు అరవింద్ అదే పనిలో ఉన్నారనీ .. గీతా ఆర్ట్స్ లోనే ఒక సినిమా చేయనున్నారని అంటున్నారు. తేజు సినిమాకి మంచి ప్రమోషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే చిరూ 'తేజ్ ఐ లవ్ యూ' ఆడియో ఫంక్షన్ కి వస్తున్నారని చెప్పుకుంటున్నారు.   

teju
chiru
pavan
  • Loading...

More Telugu News