BJP: గవర్నర్ ముందు నాలుగు ప్రధాన డిమాండ్ లు ఉంచిన ఏపీ బీజేపీ నేతలు
- గవర్నర్ ని కలిసిన ఏపీ బీజేపీ నేతలు
- మోదీపై అసభ్య పదజాలం ఉపయోగిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
- ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావును పదవి నుంచి తొలగించాలి
బీజేపీ ఏపీ నేతలు ఈరోజు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసి ప్రధానమంత్రి మోదీని దూషించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్ కి సమర్పించిన వినతిపత్రంలో ప్రధానంగా నాలుగు డిమాండ్ లు ఉంచారు.
వినతిపత్రం లోని బీజేపీ డిమాండ్లు:
- మోదీపై అసభ్య పదజాలం ఉపయోగించిన భూమా అఖిల ప్రియను కాబినెట్ నుంచి తొలగించి క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలి
- ప్రధాని మోదీ, కేంద్ర కేబినెట్ మంత్రులపై అసభ్య పదజాలం ఉపయోగిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
- పార్టీ ఫిరాయింపుల చట్టం ఉల్లఘించిన వారిపై అనర్హత వేటు వేయాలి
- బీజేపీపై నిరాధార ఆరోపణలు చేస్తూ, ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావును పదవి నుంచి తొలగించాలి