Pakistan: భారత్ లోకి చొరబడేందుకు వేచి చూస్తున్న 450 మంది టెర్రరిస్టులు: ఇంటెలిజెన్స్

  • అమర్ నాథ్ యాత్రను టార్గెట్ చేసిన తీవ్రవాదులు
  • వివిధ లాంచ్ ప్యాడ్ల వద్ద వేచి ఉన్న ముష్కరులు
  • సహకరిస్తున్న పాక్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ దళాలు

జమ్ముకశ్మీర్ లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ దగ్గర ఉన్న వివిధ లాంచ్ ప్యాడ్స్ వద్ద కనీసం 450 మంది పాక్ టెర్రరిస్టులు వేచి చూస్తున్నారని ఇంటెలిజెన్స్ తన తాజా నివేదికలో హెచ్చరించింది. సరిహద్దుల వద్ద ఉన్న వారిలో హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఉన్నారని పేర్కొంది.

జూన్ 28 నుంచి కొనసాగే అమర్ నాథ్ యాత్రను వీరు టార్గెట్ చేశారని తెలిపింది. రంజాన్ మాసం సందర్భంగా తీవ్రవాద వ్యతిరేక దాడులకు భారత్ విరామం ప్రకటించడం తీవ్రవాదులకు కలిసొచ్చిందని... కొత్త రిక్రూట్ మెంట్లను చేసుకోవడంతో పాటు, ఎక్కడెక్కడో ఉన్నవాళ్లంతా తిరిగి కలిసేందుకు వారికి సరైనంత సమయం దొరికిందని వెల్లడించింది.

ఎల్ఓసీ వద్ద పాకిస్థాన్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ దళాలు మోహరించాయని, భారత్ లోకి చొరబడేందుకు టెర్రరిస్టుల కొత్త బ్యాచ్ లు ఎదురు చూస్తున్నాయని హోంశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి కూడా తెలిపారు.

ఏయే లాంచ్ ప్యాడ్ వద్ద ఎంత మంది టెర్రరిస్టులు ఉన్నారంటే..

  • గురేజ్ సెక్టార్ - 20 మంది  
  • మాచిల్ సెక్టార్ - 50 
  • కేరన్ సెక్టార్ - 55
  • తంగ్ధార్ సెక్టార్ - 66
  • నౌగామ్ సెక్టర్ - 7
  • యూరి సెక్టార్ - 50
  • పూంచ్ సెక్టర్ - 35
  • భింభర్ సెక్టార్ - 120
  • నౌషేరా సెక్టార్ - 30
  • రాంపూర్ సెక్టార్ - 30

  • Loading...

More Telugu News