Hyderabad: ధ్వని కాలుష్యంలో దేశంలోనే మూడో స్థానంలో హైదరాబాద్

  • ప్రజలను చైతన్యపరుస్తామన్న ట్రాఫిక్ అధికారులు
  • సైలెన్సర్లు తొలగించి బైక్ లను నడిపితే కఠిన చర్యలు
  • వాహనదారుల మొబైల్స్ కు మెసేజ్ లు

హైదరాబాద్ మహా నగరం వాయు కాలుష్యంలోనే కాకుండా, ధ్వని కాలుష్యంలోనూ రికార్డులకెక్కింది. ధ్వని కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా నగర ట్రాఫిక్ పోలీసు అధికారులు మాట్లాడుతూ, ధ్వని కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రచార ఉద్యమాన్ని చేపట్టామని తెలిపారు. సైలెన్సర్లను తొలగించి బైక్ లను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్లపై హారన్లను అనవసరంగా కొట్టరాదని సూచించారు. టెలికాం సంస్థలతో మాట్లాడి ధ్వని కాలుష్యాన్ని తగ్గించేలా వాహనదారుల మొబైల్ ఫోన్లకు మెసేజ్ లు పంపాలని నిర్ణయించామని తెలిపారు. 

Hyderabad
sound pollution
  • Loading...

More Telugu News