vikram: ఒక రేంజ్ లో దూసుకుపోతోన్న 'సామి స్క్వేర్' ట్రైలర్

  • హరి దర్శకత్వంలో విక్రమ్
  • గతంలో వచ్చిన 'సామి'కి సీక్వెల్
  • విక్రమ్ జోడీగా కీర్తి సురేశ్

తమిళంలో పోలీస్ ఆఫీసర్ కథలతో వచ్చిన సూపర్ హిట్ చిత్రాలలో, విక్రమ్ హీరోగా చేసిన 'సామి' ముందు వరుసలో కనిపిస్తుంది. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో  సంచలన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా మాస్ హీరోగా విక్రమ్ ను మరోమెట్టు పైకి ఎక్కించింది. అలాంటి ఈ సినిమాకి అదే కాంబినేషన్లో 'సామి స్క్వేర్' పేరుతో సీక్వెల్ రూపొందుతోంది.

ఈ నెల 3వ తేదీన ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 8 మిలియన్ల వ్యూస్ .. 172k కి పైగా లైక్స్ రావడం విశేషం. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ కి సంబంధించిన కథలను ఉత్కంఠభరితంగా చెప్పడంలో దర్శకుడు హరి సిద్ధహస్తుడు. పైగా ఇది గతంలో ఘన విజయాన్ని అందుకున్న సినిమాకి సీక్వెల్. ఈ కారణంగానే ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు వున్నాయి. విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో ఆయన జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది.   

  • Loading...

More Telugu News