Pranab Mukherjee: ఎందరు వద్దన్నా ప్రణబ్ ముఖర్జీ ముందుకే... ఆర్ఎస్ఎస్ వేదికపై ప్రసంగం నేడే!

  • ఆర్ఎస్ఎస్ కు అవకాశం ఇవ్వొద్దని కోరిన కుమార్తె
  • సొంత పార్టీ కాంగ్రెస్, వామపక్షాల నుంచీ వ్యతిరేకత
  • అయినా తన నిర్ణయానికే కట్టుబడిన ప్రణబ్ ముఖర్జీ

మాజీ రాష్ట్రపతి, కేంద్ర మాజీ మంత్రి, గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ప్రణబ్ ముఖర్జీ, స్వతహాగా తన భావజాలానికి విరుద్ధమైన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో నేడు పాల్గొంటున్నారు. నాగ్ పూర్ లో జరిగే ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కీలక ప్రసంగం కూడా చేయనున్నారు. కాంగ్రెస్, వామపక్షాలు వద్దన్నా ఆయన పట్టించుకోలేదు. చివరికి కుమార్తె శర్మిష్టా ముఖర్జీ సైతం తండ్రిని ఈ విషయంలో హెచ్చరించింది.

నాగ్ పూర్ వెళ్లి ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తప్పుడు కథనాల సృష్టికి, వదంతుల వ్యాప్తికి సహకరించిన వారవుతారంటూ తండ్రికి ట్వీట్ ద్వారా తెలియజేసింది. అయినా గానీ వీటిని పక్కన పెట్టేసి ప్రణబ్ ముఖర్జీ నాగ్ పూర్ చేరుకున్నారు. తాను ఏం చెప్పాలనుకుంటే, అదే చెబుతానని నాగ్ పూర్ కార్యక్రమం గురించి ప్రణబ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రణబ్ దాదా ఏం మాట్లాడతారన్న ఆసక్తి ప్రజల్లోనే కాకుండా, అన్ని ప్రముఖ రాజకీయ పార్టీల్లోనూ నెలకొంది.

Pranab Mukherjee
rss
nagpur
  • Loading...

More Telugu News