Chandrababu: విజయవాడకు చేరుకున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్.. చంద్రబాబుతో కీలక చర్చలు

  • ఘన స్వాగతం పలికిన మంత్రి నారాయణ
  • చంద్రబాబు, ఈశ్వరన్ ల మధ్య జరగనున్న జేఐఎస్సీ సమావేశం
  • అమరావతి స్టార్టప్ ప్రాంతంపై కీలక ఒప్పందం చేసుకోనున్న నేతలు

సింగపూర్ మంత్రి ఈశ్వరన్ విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ఈశ్వరన్ కు మంత్రి నారాయణ ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి ఇద్దరూ విజయవాడకు చేరుకున్నారు.

ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈశ్వరన్ ల మధ్య జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ (జేఐఎస్సీ) సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా అమరావతిలో స్టార్టప్ ప్రాంతం 'ఫేజ్ జీరో' అభివృద్ధిపై చర్చ జరుగుతుంది. అనంతరం ఇద్దరూ కీలక ఒప్పందం చేసుకోనున్నారు. దీంతోపాటు విజయవాడ నుంచి సింగపూర్ కు విమాన సర్వీసులను నడిపే అంశంపై కూడా చర్చ జరగనుంది. ఈరోజు జరుగుతున్నది మూడో జేఐఎస్సీ సమావేశం.

Chandrababu
eswaran
singapore
amaravathi
jisc meeting
  • Loading...

More Telugu News