Rajinikanth: నేను అన్నదాంట్లో తప్పేమిటో నాకు తెలియదు!: రజనీకాంత్

  • సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలని మాత్రమే చెప్పాను
  • అంతకు మించి నేను ఏమీ మాట్లాడలేదు
  • సినిమా చూడాలనుకునేవారిని దయచేసి అడ్డుకోవద్దు

సుప్రీంకోర్టు తీర్పు మేరకు కావేరి యాజమాన్య బోర్డు నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని మాత్రమే కర్ణాటక ప్రభుత్వాన్ని గతంలో తాను కోరానని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. అంతకు మించి తాను ఏమీ మాట్లాడలేదని... తాను అన్నదాంట్లో తప్పు ఏముందో తనకు తెలియదని చెప్పారు. కన్నడిగుల ప్రయోజనాలను దెబ్బతీయాలన్న ఆలోచన తనకు ఎంతమాత్రం లేదని తెలిపారు.

 ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సినిమాను కర్ణాటకలో నిలిపివేయడం మంచిది కాదని అన్నారు. సినిమా ప్రశాంతంగా విడుదలై, ప్రశాంతంగా ప్రదర్శింపబడేలా ముఖ్యమంత్రి కుమారస్వామి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని చెప్పారు. సినిమా చూడాలనుకునేవారిని అడ్డుకోవద్దని కన్నడ సంఘాలను కోరారు.

Rajinikanth
kaala
Karnataka
kauveri
  • Loading...

More Telugu News