kaala: విడుదలకు ముందే ఫేస్ బుక్ లో ప్రత్యక్షమైన రజనీకాంత్ 'కాలా'!

  • సింగపూర్ లో ప్రీమియర్ లీక్
  • ఫేస్ బుక్ లో లైవ్ టెలికాస్ట్
  • 45 నిమిషాల సినిమా అప్ లోడ్

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'కాలా' నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే, విడుదలకు ముందే ఈ సినిమా యూనిట్ కు షాక్ తగిలింది. సింగపూర్ లో ఈ సినిమా ప్రీమియర్ షో లీక్ అయింది. ఫేస్ బుక్ లో 'కాలా'ను లైవ్ టెలికాస్ట్ చేశారు. 45 నిమిషాల పాటు సినిమాను అప్ లోడ్ చేశారు.

భారత్ కంటే ముందే సింగపూర్ లో 'కాలా' సినిమా ప్రివ్యూలు పడ్డాయి. అక్కడ ఉంటున్న ప్రవీణ్ దేవర అనే వ్యక్తి సినిమాకు వెళ్లి, తన మొబైల్ ద్వారా దాదాపు 45 నిమిషాల సినిమాను లైవ్ లో పెట్టాడు. దీనిపై సమాచారం అందుకున్న సింగపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.

మరోవైపు కర్ణాటకలో ఈ సినిమా ప్రదర్శనకు సంబంధించి టెన్షన్ కొనసాగుతూనే ఉంది. రజనీ అల్లుడు ధనుష్ ఈ సినిమాను నిర్మించాడు. పా రంజిత్ దర్శకత్వం వహించగా సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో రజనీతో పాటు నానా పటేకర్, సముద్రఖని, హుమా ఖురేషి, ఈశ్వరి రావులు నటించారు.

kaala
movie
Rajinikanth
leak
facebook
singapore
  • Loading...

More Telugu News