Telugudesam: నా బాధను వివరించేందుకు వచ్చాను.. సీఎంతో చర్చించాక చెబుతా: ఎమ్మెల్యే జనార్దనరెడ్డి కీలక వ్యాఖ్యలు

  • గత కొంతకాలంగా మంత్రి అఖిలప్రియపై అసంతృప్తి
  • ఇటీవల మహానాడుకు గైర్హాజరు
  • సీఎం నివాసానికి చేరుకున్న బనగానపల్లె ఎమ్మెల్యే 
  • తనకు ఎవరిపైనా అసంతృప్తి లేదంటూ వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అఖిలప్రియ తీరుపై అసంతృప్తితో ఉన్న కర్నూలు జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి.. విజయవాడకు వచ్చి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. సీఎం నివాసానికి చేరుకున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన బాధను వివరించేందుకు వచ్చానని, పార్టీలో తనకు ఎవరిపైనా అసంతృప్తి లేదని వ్యాఖ్యానించారు. సీఎంను కలిశాక తానే అన్ని విషయాలు చెబుతానని వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల నిర్వహించిన మహానాడుకు కూడా సదరు ఎమ్మెల్యే హాజరుకాలేదు.         

Telugudesam
Chandrababu
akhilapriya
mla
  • Loading...

More Telugu News