Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మరో ప్రయోగం

  • ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్సులు
  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణాలు
  • ప్రతిపాదనలపై ట్రాఫిక్ నిపుణులతో స్టడీ
  • తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సూచనలు

హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల పరిష్కారానికి పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం) పద్ధతిలో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణానికి నెలలోగా ఔత్సాహికుల నుండి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ ను పిలవాలని సంబంధిత అధికారులకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సూచించారు. ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణంపై నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి సమీక్షించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, లా సెక్రటరీ నిరంజన్ రావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి, మార్కెటింగ్ శాఖ సంచాలకురాలు లక్ష్మీబాయి, స్పోర్ట్స్ ఎండీ దినకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్సుల
నిర్మాణానికి వచ్చిన ప్రతిపాదనలపై ట్రాఫిక్ నిపుణులతో స్టడీ చేయించాలన్నారు.

నగరంలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 42 ప్రాంతాలలో పార్కింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణానికి భూములను గుర్తించామని, ఈ ప్రాంతాల్లో ఆయా శాఖలు తమ అవసరాలతో పాటు వాణిజ్య, పార్కింగ్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. ప్రతి పార్కింగ్ కాంప్లెక్స్ ను యూనిట్ గా అభివృద్ధి చేయాలని, వాణిజ్య అంశాలను దృష్టిలో ఉంచుకొని, ప్యాకేజీల వారిగా ప్రతిపాదనలు తయారు చేయాలని తెలిపారు.

  • Loading...

More Telugu News