dogs: కుక్కలకు లైసెన్సులు.. లేదంటే ఫైన్‌.. మండిపడుతోన్న బెంగళూరు వాసులు

  • బీబీఎంపీ కొత్త నిబంధనలు
  • న్యూ పెట్ లైసెన్సింగ్ స్కీమ్ అమలు
  • కుక్కలకు రేడియో కాలర్‌ ఎంబెడెడ్ చిప్

ఇకపై బెంగళూరు వాసులు కుక్కలను పెంచుకోవాలంటే బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) జారీ చేసిన నిబంధనలను పాటించాల్సిందే. తమ పరిధిలో ఉన్న ఫ్లాట్స్, ఇండిపెండెంట్ ఇళ్లలో కుక్కలను పెంచుకోవాలంటే న్యూ పెట్ లైసెన్సింగ్ స్కీమ్ పాటించాలని బీబీఎంపీ ఆదేశాలు జారీ చేసింది. ఆ నిబంధనల ప్రకారం అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో ఒక పెంపుడు కుక్క కంటే ఎక్కువగా పెంచుకోకూడదు. అలాగే ఇండిపెండెంట్ ఇళ్లలో 3 కుక్కల కంటే అధికంగా పెంచుకోకూడదు.

అంతేకాదు, వాటిని పెంచుకోవాలంటే లైసెన్స్ తీసుకుని, రేడియో కాలర్‌తో కూడిన ఎంబెడెడ్ చిప్ తీసుకోవాలి. ఒకవేళ కుక్కలకు లైసెన్స్‌ తీసుకోకపోతే రూ.1000 జరిమానా విధిస్తారు. అయితే, కొత్త నిబంధనలపై బెంగళూరు వాసులు మండిపడుతున్నారు.

dogs
Karnataka
  • Loading...

More Telugu News