ke krishnamurthy: కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటా: కేఈ

  • కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోదు
  • పవన్, జగన్ లు బీజేపీతో చేతులు కలపడం బాధాకరం
  • పొత్తుల విషయాన్ని ఎన్నికల సమయంలో నిర్ణయిస్తాం

కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ విషయాన్ని తాను వ్యక్తిగతంగా మాత్రమే చెప్పడం లేదని, పార్టీ తరపునే చెబుతున్నానని తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకోవడానికి కూడా తాను సిద్ధమని చెప్పారు.

కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నీచ రాజకీయాల్లో భాగంగానే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్, జగన్ లు బీజేపీతో చేతులు కలపడం బాధాకరమని అన్నారు. పొత్తుల విషయాన్ని ఎన్నికల సమయంలో నిర్ణయిస్తామని చెప్పారు. 

ke krishnamurthy
Chandrababu
Jagan
Pawan Kalyan
BJP
Congress
  • Loading...

More Telugu News