keerthi suresh: 'మహానటి'కి 26 రోజులు .. 26 కోట్ల షేర్!

- నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'మహానటి'
- ప్రధానమైన పాత్రలో కీర్తి సురేశ్
- విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లు
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన 'మహానటి' మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా విజయవిహారం చేసింది. ఈ సినిమా విడుదలైన 26 రోజుల్లో 26 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేయడం విశేషం. కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషంగా చెబుతున్నారు.
