amit shah: సంపర్క్ ఫర్ సమర్థన్: మాధురీ దీక్షిత్ ను కలిసిన అమిత్ షా

  • జుహూలోని మాధురీ నివాసానికి వెళ్లిన అమిత్ షా
  • వెంట సీఎం ఫడ్నవీస్ కూడా
  • రతన్ టాటా, లతా మంగేష్కర్, ఉద్ధవ్ థాకరేలను కలవనున్న బీజేపీ చీఫ్

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అప్పుడే కార్యాచరణ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సంపర్క్ ఫర్ సమర్థన్ (కాంటాక్ట్ ఫర్ సపోర్ట్) కార్యక్రమాన్ని చేపట్టింది. గత ఎన్నికల సమయంలో బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రముఖులను బీజేపీకి చెందిన కీలక నేతలు వ్యక్తి గతంగా కలిసి... బీజేపీ పాలనలో సాధించిన విజయాలను వారికి వివరించడం, రానున్న ఎన్నికల్లో మద్దతును కోరడమే ఈ కార్యక్రమం లక్ష్యం.

ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు ముంబైలో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, ఆమె భర్త శ్రీరామ్ నేనేను కలిశారు. జుహులో ఉన్న ఆమె నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అమిత్ షాతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఉన్నారు.

సాయంత్రం 4.30 గంటలకు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాను, 5.30కు ప్రఖ్యాత గాయకురాలు లతా మంగేష్కర్ ను, 7.30కు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేను అమిత్ షా కలవనున్నారు.

amit shah
madhuri dixit
fadanavis
contact for support
  • Loading...

More Telugu News