HP: సుమారు 5 వేల మందిని ఇంటికి పంపేయనున్న హెచ్పీ!

  • పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఉద్యోగుల తొలగింపు
  • గతంలో చెప్పిన సంఖ్యను పెంచిన హెచ్పీ
  • ప్రస్తుతం పీసీల అమ్మకాల్లో టాప్ లో ఉన్న కంపెనీ

యూఎస్ కేంద్రంగా ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన హెల్వెట్ పాకార్డ్ (హెచ్పీ), వచ్చే ఆర్థిక సంవత్సరం చివరిలోగా 4,500 నుంచి 5 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. సంస్థ రీస్ట్రక్చర్ లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అక్టోబర్ 2016లోనే పునర్మిర్మాణ ప్రణాళికకు హెచ్పీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం పలుకగా, సంస్థ నుంచి 4 వేల మందిని తొలగించాల్సి రావచ్చని అప్పట్లోనే సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని ఇప్పుడు వెల్లడించింది.

కాగా, గత సంవత్సరం అక్టోబర్ మాసాంతానికి హెచ్పీలో 49 వేల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. తాజాగా కంపెనీ సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్ లో లే ఆఫ్స్‌ ప్రీట్యాక్స్‌ ఛార్జీలు 500 మిలియన్ డాలర్ల నుంచి 700 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు తెలిపింది. ఇదిలావుండగా, సంస్థ రెండు భాగాలుగా విడిపోయిన తరువాత, పీసీలు, ప్రింటర్ల అమ్మకంపై ప్రధానంగా దృష్టిని సారించిన యాజమాన్యం, డెడ్‌-సెంటర్‌, సాఫ్ట్‌వేర్‌, సర్వీస్ యూనిట్లను కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం తొలి ఐదు నెలల కాలంలో 22.6 శాతం మార్కెట్‌ వాటాతో సంస్థ పర్సనల్ కంప్యూటర్ల విక్రయాల్లో ప్రథమ స్థానంలో ఉంది.

  • Loading...

More Telugu News