srinu vaitla: వీసాల సమస్య.. హైదరాబాద్ లోనే 'అమర్ అక్బర్ ఆంటోని'!

  • శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని'
  • అమెరికాలో షూటింగుకి ఆటంకం 
  • హైదరాబాద్ లో షూటింగుకు సన్నాహాలు

శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే కొంతభాగాన్ని విదేశాల్లోనూ .. మరికొంత భాగాన్ని ఇక్కడ చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాత్రలను అక్కడ చిత్రీకరించవలసి వుంది.అయితే కొన్ని కారణాల వలన వీసాలు ఆలస్యం కానున్నాయట. దాంతో హైదరాబాద్ లో తరువాత చేద్దామనుకున్న షెడ్యూల్ ను ముందుకు జరిపినట్టుగా సమాచారం. వీసాలు వచ్చేలోగా హైదరాబాద్ ఓ 15 రోజుల పాటు షూటింగ్ జరపడానికి ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ కి సంబంధించిన ఆర్టిస్టులను అందుబాటులోకి తెచ్చుకుని .. షూటింగుకి సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ వచ్చిన అవుట్ పుట్ విషయంలో రవితేజ .. శ్రీను వైట్ల సంతృప్తికరంగా ఉన్నాడట.    

srinu vaitla
raviteja
  • Loading...

More Telugu News