kojjepalli: 'కొజ్జేపల్లి' గ్రామస్తులకు శుభవార్త.. పేరు మార్చుకోవచ్చట!

  • కొజ్జేపల్లి పేరుతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
  • పేరు మార్చాలంటూ విన్నపం
  • గ్రామం పేరు మార్చుకోవచ్చన్న జిల్లా రెవెన్యూ అధికారి

ఎవరైనా తమ ఊరి పేరును గొప్పగా చెప్పుకుంటారు. కానీ, ఈ ఊరి జనాలు మాత్రం చెప్పుకోవడానికి ఎంతో ఇబ్బంది పడతారు. తమ ఊరి పేరు చెబితే అందరూ నవ్వుతున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. కారణం ఈ ఊరి పేరు కొజ్జేపల్లి. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారి రఘునాథ్ మాట్లాడుతూ, గ్రామం పేరు మార్చుకునే వీలు ఉందని చెప్పారు.

తొలుత తమ గ్రామం పేరు మార్చాలని గ్రామ పంచాయతీ తీర్మానం చేయాలని రఘునాథ్ చెప్పారు. ఆ తర్వాత గెజిట్ కోసం జిల్లా కలెక్టర్ కు అర్జీ పెట్టుకోవాలని తెలిపారు. ఆ తర్వాత దీనిపై విచారణ జరపాలంటూ ఆర్డీఓకు అర్జీ అందుతుందని, అక్కడి నుంచి తహసీల్దారుకు అర్జీ వెళ్తుందని చెప్పారు. ఆ తర్వాత తహసీల్దారు గ్రామానికి వెళ్లి, ప్రజాభిప్రాయం సేకరిస్తారని తెలిపారు.

 గ్రామస్తులు సూచించిన పేరు జిల్లాలో ఏ గ్రామానికీ లేకపోతే... వారు కోరుకున్న పేరును సిఫారసు చేస్తారని చెప్పారు. ఒకవైళ అదే పేరుతో మరో గ్రామం ఉంటే వారు కోరిన పేరుకు నంబరింగ్ ఇస్తారని తెలిపారు. ఆ తర్వాత పూర్తి నివేదికను కలెక్టర్ కు సమర్పిస్తారని... దాన్ని ప్రభుత్వానికి కలెక్టర్ పంపుతారని చెప్పారు. నివేదికను ప్రభుత్వం పరిశీలించిన తర్వాత... గెజిట్ జారీ చేస్తుందని, అప్పుడు అధికారికంగా రికార్డుల్లో పేరు మార్పు జరుగుతుందని తెలిపారు. 

  • Loading...

More Telugu News