saidharam tej: చిరూ ముఖ్య అతిథిగా 'తేజ్ ఐ లవ్ యూ' ఆడియో ఫంక్షన్

- కరుణాకరన్ దర్శకత్వంలో 'తేజ్ ఐ లవ్ యూ'
- తేజు సరసన అనుపమ పరమేశ్వరన్
- సంగీత దర్శకుడిగా గోపీసుందర్
కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఒక ప్రేమకథా చిత్రం చేస్తున్నాడు. 'తేజ్ ఐ లవ్ యూ' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా చివరిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి సన్నాహాలు చేస్తున్నారు.
