charan: బోయపాటి మూవీలో సిక్స్ ప్యాక్ తో చరణ్ ?

  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ 
  • ముఖ్య పాత్రల్లో స్నేహ .. ప్రశాంత్ 
  • సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన  

బోయపాటి దర్శకత్వంలో చరణ్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతభాగం షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. 'జగదేకవీరుడు' అనే టైటిల్ ను పరిశీలన కోసం చిరంజీవి ముందు బోయపాటి ఉంచినట్టుగా చెప్పుకుంటున్నారు.

ఈ సినిమాలో చరణ్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ రాకేశ్ ఉడియార్ దగ్గర ఆయన ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్టుగా చెబుతున్నారు. చరణ్ ను మరోమారు సిక్స్ ప్యాక్ లో చూడాలనే అభిమానుల ముచ్చట ఈ సినిమా ద్వారా తీరనుందన్న మాట. వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ప్రశాంత్ .. స్నేహ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు.  

  • Loading...

More Telugu News