Ayodhya: రాముడిని మోసం చేసిన బీజేపీ ఓడిపోక ఏమవుతుంది?: అయోధ్య పూజారి శాపనార్థాలు!

  • 2014లో అధికారంలోకి వచ్చి మరచిపోయారు
  • బీజేపీ గెలవడానికి రాముడు కూడా కారణమే
  • తక్షణమే రామమందిరం నిర్మించాలి
  • ఆచార్య ఎస్ దాస్ డిమాండ్

శ్రీరాముడి పేరు చెప్పుకుని 2014లో అధికారంలోకి వచ్చి, ఆపై ఆయన్ను మరచిపోయినందునే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ఓడిపోతున్నదని అయోధ్య రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య ఎస్ దాస్ శాపనార్థాలు పెట్టారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే, వెంటనే రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని, లేకుంటే బీజేపీకి అధికారాన్ని నిలుపు కోవడం క్లిష్టతరమవుతుందని చెప్పారు. తక్షణమే రామమందిరాన్ని నిర్మించకుంటే ఉద్యమిస్తామని చావాని టెంపుల్ అర్చకుడు మహంత్ పరమహంస దాస్ హెచ్చరించిన గంటల వ్యవధిలోనే ఆచార్య దాస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రామమందిరం కోసం ఉద్యమం జరిగితే బీజేపీకి ఓటమి తప్పదని, ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని హెచ్చరించిన ఆయన, బీజేపీ అధికారంలోకి రావడానికి రాముడు కూడా కారణమన్న సంగతి మరువరాదని హితవు పలికారు.

Ayodhya
Ram Mandir
Acharya S Das
BJP
  • Loading...

More Telugu News