Allu Arjun: టాలీవుడ్ అగ్ర దర్శకులంతా ఒక్కచోట చేరడంపై అల్లు అర్జున్ హర్షం

- సోషల్ మీడియాలో దర్శకుల ఫొటోలు హల్‌చల్
- దర్శకుల కోసం సుకుమార్, వంశీ విందు ఇచ్చారన్న బన్నీ
- చాలా లవ్లీగా ఉందని ట్వీట్
- వారందరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడటం బాగుందని వ్యాఖ్య
తొమ్మిది మంది టాలీవుడ్ దర్శకులు ఒకే ఫ్రేమ్‌లో కనపడుతోన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. రాజమౌళి, వంశీ పైడిపల్లితో పాటు పలువురు దర్శకులు ఈ ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. వారిద్దరితో పాటు ఈ ఫొటోల్లో సుకుమార్, క్రిష్, కొరటాల శివ, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా ఉన్నారు.
