Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

  • కమ్ముకున్న మేఘాలు
  • పలు చోట్ల ఈదురు గాలులు
  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

జూన్‌ నెల మొదటి వారంలోనే హైదరాబాద్‌లో వర్షాలు దంచి కొడుతున్నాయి. దట్టమైన మేఘాలు కమ్ముకుని చల్లటి వాతావరణం కనపడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ముషీరాబాద్, నారాయణగూడ, ట్యాంక్‌ బండ్, కోఠి, ఆబిడ్స్, దిల్‌సుఖ్‌ నగర్, చైతన్యపురి, కొత్తపేట, కర్మన్‌ఘాట్‌, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పలు చోట్ల ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండగా కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది.               

Hyderabad
rain
  • Loading...

More Telugu News