Chandrababu: సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ లా చంద్రబాబు మాట్లాడట్లేదు!: లక్ష్మీపార్వతి

  • జగన్, పవన్ లు బీజేపీ కోవర్టులట!
  • ఈ మాటలు పరిపక్వత లేని వాళ్ల మాటల్లా ఉన్నాయి 
  • ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మాట్లాడినట్టుగా లేవు!

జగన్, పవన్ లు బీజేపీ కోవర్టులంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాట్లాడటం తగదని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. ‘తెలుగు పాపులర్ టీవీ’ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘ఈ మాటలు పరిపక్వత లేని వాళ్లు మాట్లాడే మాటల్లా ఉన్నాయి తప్ప, ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషయన్ మాట్లాడినట్టుగా లేవు!’ అని విమర్శించారు.

తాను చేసిన పాపాలకు భయపడిపోతున్న చంద్రబాబు, తనపై ఎక్కడ కేసులు పెడతారోనని చెప్పి వణకిపోతున్నారని ఆరోపించారు. ఈ కేసుల నుంచి తనను తప్పించమంటూ రాహుల్ గాంధీ కాళ్లు చంద్రబాబు పట్టుకుంటున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

Chandrababu
lakshmi parvathi
  • Loading...

More Telugu News