Chandrababu: చంద్రబాబు అవినీతిపై బీజేపీ ఓ కేసు వేయాలి: లక్ష్మీపార్వతి డిమాండ్

  • చంద్రబాబుపై బీజేపీ కారాలూ మిరియాలు నూరుతోంది
  • బీజేపీకి ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి
  • విచారణ చేస్తే బాబు పాపపు సొమ్ములు మొత్తం బయటపడతాయి

ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. ‘తెలుగు పాపులర్ టీవీ’ అనే వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘చంద్రబాబునాయుడు గారికి ఎవరైతే ఇప్పటి వరకు మిత్రులుగా ఉన్నారో.. వాళ్లు కూడా ఈరోజున ఆయన్ని అసహ్యించుకునే పరిస్థితి! దీనిని బట్టి ఆయన పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది. నిన్నటి వరకూ బీజేపీ లో ఉన్నారు. అదే బీజేపీ ఈరోజున ఆయనపై కారాలూ మిరియాలు నూరుతోంది. ఈ కారాలూ మిరియాలు ఇక్కడ నూరే బదులు అతను (చంద్రబాబు) చేసిన అవినీతిపై ఓ కేసు వేయమని మేము అడుగుతున్నాం. మీకు (బీజేపీ) ధైర్యం ఉంటే కనుక చంద్రబాబు చేసిన దోపిడీపై ఒక్క ఎంక్వైరీ వేయండి. దాంట్లో అతని పాపపు సొమ్ములు మొత్తం, బినామీ ఆస్తులు, ఇన్నేళ్లూ ఏపీ ప్రజలను లూఠీ చేేసిన సొమ్ము బయటకొస్తుంది.. సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం’ అని అన్నారు.

Chandrababu
lakshmi parvathi
  • Loading...

More Telugu News