Hyderabad: హైదరాబాద్‌ అబిడ్స్‌లో పదో అంతస్తు నుంచి దూకి.. యువతి ఆత్మహత్య

  • మయూరి కాంప్లెక్స్‌ వద్ద ఘటన
  • యువతి వద్ద హోండా యాక్టివా బైక్‌ కీ 
  • మృతదేహం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు
  • ఆ యువతి ఎవరన్న విషయంపై పోలీసుల ఆరా

హైదరాబాద్‌ అబిడ్స్‌లో ఓ యువతి పదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. మయూరి కాంప్లెక్స్‌లోకి వచ్చిన ఆ అమ్మాయి పదో అంతస్తు ఎక్కి దూకడానికి నిలబడగా గుర్తించిన స్థానికులు.. కిందికి దిగి రావాలని అన్నారు. అయితే కొన్ని సెకన్లకే ఆమె ఒక్కసారిగా దూకేసింది.

దీంతో స్థానికులు పోలీస్‌ స్టేషన్‌కి ఫోన్ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. ఆమె గురించి ఎటువంటి ఆధారాలు దొరకలేదని, ఫోన్‌ నెంబరు కూడా లభ్యం కాలేదని అన్నారు. ఆమె వయసు 20-25 మధ్య ఉంటుందని, పింక్‌ కలర్‌ టీ షర్ట్ వేసుకుందని చెప్పారు. ఉదయం 10 గంటలకు షాప్స్‌ ఓపెన్‌ చేయలేదని, అదే సమయంలో ఆమె అక్కడకు వచ్చి ఈ ఘటనకు పాల్పడిందని తెలిపారు. ఆమె వద్ద హోండా యాక్టివా బైక్‌ కీ ఉందని, అయితే, ఆ బైక్‌ కూడా ఇంకా దొరకలేదని అన్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.                                                           

  • Error fetching data: Network response was not ok

More Telugu News