YV Subba Reddy: స్పీకర్ ను మళ్లీ కలుస్తాం.. చంద్రబాబు వ్యాఖ్యలపై సుబ్బారెడ్డి స్పందన!

  • మళ్లీ స్పీకర్ ను కలుస్తాం
  • రాజీనామాలను ఆమోదింపజేసుకుంటాం
  • కేంద్రంపై అందరికన్నా ముందు అవిశ్వాస తీర్మానం పెట్టింది మేమే

ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను సాధించాలనే చిత్తశుద్ధితోనే తమ పదవులకు రాజీనామాలు చేశామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోవడం కోసం లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ను ఇప్పటికే పలుమార్లు కలిశామని... మళ్లీ కలుస్తామని చెప్పారు. నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు గుప్పించిన నేపథ్యంలో... సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై అందరికన్నా ముందు అవిశ్వాస తీర్మానం పెట్టింది వైసీపీనే అని ఆయన చెప్పారు.

మరోవైపు నిన్న చంద్రబాబు మాట్లాడుతూ, బీజేపీ, వైసీపీలు కలిసి డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. రాజీనామాల పేరుతో నాటకాలాడుతున్నారని... ఈ రెండు పార్టీల మధ్య లాలూచీ లేకపోతే, ఇంత వరకు రాజీనామాలను ఎందుకు ఆమోదించలేదని ఎద్దేవా చేశారు. రాజీనామాల పేరుతో ప్రజలను వైసీపీ మోసగిస్తోందని మండిపడ్డారు.

YV Subba Reddy
Chandrababu
YSRCP
mp
resignations
sumitra mahajan
  • Loading...

More Telugu News