Virat Kohli: కోహ్లీకి గడ్డుకాలమే.. పుజారా రాణిస్తాడు: మెక్ గ్రాత్

  • అండర్స్ బౌలింగ్ ను ఎదుర్కోవడం కోహ్లీకి సవాలే
  • ఇంగ్లండ్ పరిస్థితులు కోహ్లీకి అనుకూలంగా ఉండవు
  • బుమ్రా, భువనేశ్వర్ లు సత్తా చాటుతారు

త్వరలో జరగనున్న ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం ఖాయమని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ మెగ్ గ్రాత్ అన్నాడు. సమకాలీన క్రికెట్ లో కోహ్లీ గొప్ప బ్యాట్స్ మెన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని... అయితే, ఇంగ్లండ్ లోని పరిస్థితులు కోహ్లీకి అనుకూలంగా ఉండవని చెప్పాడు.

ముఖ్యంగా ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ అండర్సన్ ను ఎదుర్కోవడం కోహ్లీకి పెను సవాలే అని, అతని బౌలింగ్ ను ఎదుర్కోవడం కష్టమే అని తెలిపాడు. కోహ్లీపైనే భారత్ ఆధారపడితే ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఈ పర్యటనలో పుజారా రాణిస్తాడనే నమ్మకం తనకు ఉందని చెప్పాడు. భారత బౌలర్లు బుమ్రా, భువనేశ్వర్ లు రాణిస్తారని తెలిపాడు. భారత జట్టు సమష్టిగా రాణిస్తేనే ఫలితం దక్కుతుందని సూచించాడు.

మరోవైపు అన్ని దేశాల్లో సత్తా చాటిన కోహ్లీ... ఇంగ్లండ్ లో మాత్రం తడబడుతున్నాడు. గత ఇంగ్లండ్ పర్యటనలు కోహ్లీకి నిరాశనే మిగిల్చాయి. దీంతో, ఈసారి ఇంగ్లీష్ పిచ్ లపై తన సత్తా చాటాలనే పట్టుదలతో కోహ్లీ ఉన్నాడు.

Virat Kohli
mc grath
anderson
pujara
bumra
Bhuvneshwar Kumar
  • Loading...

More Telugu News