jc diwakar reddy: ఏడాది ముందు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు రావనే విషయం వారికి తెలుసు: జేసీ ఎద్దేవా

  • వైసీపీ ఎంపీల రాజీనామాలు డ్రామాలే
  • బీజేపీతో కలిసి వైసీపీ నాటకాలాడుతోంది
  • రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్ జాప్యం చేస్తున్నారు

వైసీపీ, ఆ పార్టీ నేతలపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమరావతిలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలన్నీ డ్రామాలే అని ఎద్దేవా చేశారు. బీజేపీతో కలసి వైసీపీ ఆడుతున్న నాటకంలో ఇదొక భాగమని చెప్పారు. ఎన్నికలకు ఏడాది ముందు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు జరగవన్న సంగతి వైసీపీ ఎంపీలకు తెలుసని అన్నారు. అందుకే వారు రాజీనామాలు చేశారని చెప్పారు. వారి రాజీనామాలను ఆమోదించే విషయంలో కూడా లోక్ సభ స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శించారు. 

jc diwakar reddy
YSRCP
mp
resignations
sumitra mahajan
  • Loading...

More Telugu News