Pakistan: భారత్, పాక్ సరిహద్దుల వద్ద కాల్పులు.. రెండోసారి పాకిస్థాన్ కాళ్లబేరం!

  • రంజాన్ మాసంలో కాల్పుల విరమణ ఒప్పందం
  • ఒప్పందానికి తూట్లు పెట్టిన పాకిస్థాన్
  • ఇద్దరు జవాన్ల బలితో రగిలిపోతున్న బీఎస్ఎఫ్
  • భారత సైన్యం ధాటికి తట్టుకోలేక, దాడులు వద్దంటూ వినతి

పాకిస్థాన్ మరోసారి కాళ్లబేరానికి వచ్చింది. పవిత్ర రంజాన్ మాసంలో కాల్పుల విరమణంటూ ప్రతిపాదించి, ఇచ్చిన మాటను తప్పి, భారత సైనికుల ధాటిని తట్టుకోలేక రెండు వారాల క్రితం దయచేసి దాడులు ఆపాలంటూ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. పాక్ కోరికను భారత్ మన్నించగా, తన బుద్ధి మారదని చెబుతూ, మరోసారి పాక్ సైనికులు భారత పోస్టులు, అమాయక పౌరులు లక్ష్యంగా జమ్మూలోని అక్నూర్ సెక్టార్ లో కాల్పులు జరుపుతున్న వేళ భారత్ స్పందించింది.

 సరిహద్దులకు ఆవల ఉన్న పాక్ సైనికుల పోస్టులు, బంకర్లు లక్ష్యంగా బీఎస్ఎఫ్ జవాన్లు విజృంభిస్తుండటంతో నెల రోజుల వ్యవధిలోనే పాక్ మరోసారి దాడులు వద్దని వేడుకుంది. సైనికులకు విశ్రాంతిని ఇద్దామని, కాల్పులను ఆపేద్దామని కోరింది. కాగా, ఇటీవలి పాక్ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించడాన్ని భారత సైన్యం సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. భారత్, పాక్ సరిహద్దుల మధ్య సాగుతున్న కాల్పుల వీడియో ఒకటి బయటకు వచ్చి వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరు చూడవచ్చు.

  • Loading...

More Telugu News