Karnataka: కర్ణాటకలో సంచరిస్తున్న వింతజీవి... గ్రహాంతరవాసేనంటూ వీడియో వైరల్.. ఫేక్ అంటున్న కొందరు!

  • తొలుత ఏదో జంతువనుకున్న ప్రజలు
  • ఆపై బంధించిన వేటగాళ్లు
  • నిజమెంతున్నా వైరల్ అవుతున్న వీడియో

కర్ణాటక రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో వింత జీవి సంచరిస్తోందని, అది గ్రహాంతరవాసేనని సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతంలో ఇది తిరుగుతూ ఉండగా, తొలుత ఏదో జంతువని అక్కడున్న ప్రజలు భావించారని, ఆపై ఓ పథకం ప్రకారం దాన్ని వేటగాళ్లు బంధించారని ఫేస్ బుక్ లో ఓ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఇక ఈ వీడియో, అందులోని జీవి గురించిన వివరాలను నాసాకు కూడా పంపారట. ఇక ఈ వీడియోలో దాదాపు రెండు, రెండున్నర అడుగుల ఎత్తులో ఉన్న ఓ మానవాకారం, తెల్లని ముఖం, పొడవైన జుట్టుతో కనిపిస్తోంది. చేతులు చిన్నగా ఉన్నాయి. కాళ్లు కనిపించడం లేదుగానీ, కళ్లు, ముక్కు, నోరు కూడా ఉన్నాయి.

అయితే, ఇదంతా ఫేక్ అంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు. ప్రచారం కోసం ఎవరో పుట్టించిన వీడియో వార్తగా దీనిని పేర్కొంటున్నారు. ఇక ఇది గ్రహాంతర వాసేనన్న ప్రచారంలో నిజానిజాలు ఎలావున్నా, దాన్ని మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News