Arman Kohli: సహజీవన భాగస్వామిని దారుణంగా కొట్టి పరారైన బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీ!

- మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న అర్మాన్, నీరూ
- ఆర్థిక సంబంధ అంశాల్లో విభేదాలు
- ఉన్మాదిలా మారిన అర్మాన్ కోహ్లీ
- ప్రస్తుతం ఆసుపత్రిలో నీరూ
వివాదాస్పద బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ పోటీదారు అర్మాన్ కోహ్లి, తన సహజీవన భాగస్వామి, ఫ్యాషన్ స్టయిలిస్ట్ నీరూ రంధావాను తీవ్రంగా హింసించగా, ఆమె ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నీరూను దారుణంగా కొట్టిన అర్మాన్, ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ముంబై పరిధిలోని శాంతాక్రజ్ పోలీసుల కథనం ప్రకారం, గత మూడేళ్లుగా నీరు, అర్మాన్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరి మధ్యా ఆర్థిక సంబంధ అంశాల్లో సమస్యలున్నాయి. గోవాలోని ఓ విల్లా అమ్మకం విషయంలో విభేదాలు తారస్థాయికి చేరగా, ఆదివారం రాత్రి, ఉన్మాదిలా మారిన కోహ్లీ, నీరూను జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టాడు. మెట్లపై నుంచి ఆమె జారి కిందపడింది.
