Amaravathi: అమరావతి నేలపై అనుమానాలు పటాపంచలు!

  • అమరావతిలో 23 చోట్ల భూసార పరీక్షలు
  •  40 అడుగుల లోపే ‘షీట్ రాక్’
  • రాయి కనిపించగానే అధికారుల్లో ఆనందం

బహుళ అంతస్తుల నిర్మాణాలకు అమరావతి నేల అనుకూలం కాదన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. భూసార పరీక్షల్లో అక్కడి నేల గట్టిదని తేలింది. అమరావతిలో శాశ్వత సచివాలయ నిర్మాణ ప్రాంతంలో 28 నుంచి 45 అడుగుల లోపే గట్టి రాయి తగలడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. రాయి కనిపించగానే అధికారులు, నిపుణుల్లో ఆనందం కనిపించింది.

నిజానికి వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం కోసం జరిపిన భూసార పరీక్షల్లో రాయి కోసం 100 అడుగుల లోతు వరకు వెళ్లాల్సి వచ్చింది. కానీ శాశ్వత నిర్మాణాలు జరిపే ప్రాంతంలో తక్కువ లోతులోనే రాయి తగలడంతో అధికారుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ పరీక్షలతో భారీ నిర్మాణాలకు ఇక్కడి భూమి అనుకూలం కాదన్న అనుమానాలకు చెక్ పడిందని అధికారులు పేర్కొన్నారు.

23 చోట్ల పరీక్షలు చేసిన భూసార పరీక్షల్లో ‘షీట్ రాక్’గా అభివర్ణించే రాతిపొర కనిపించిందని, ఇది 40, 50 అంతస్తులతో నిర్మించే సచివాలయాన్ని దృఢంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News