raghuveera reddy: నవనిర్మాణ దీక్ష పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని టీడీపీ ప్రచారానికి వాడుతున్నారు: రఘువీరారెడ్డి

  • ప్రజలకు అసత్యాలు చెబుతున్నారు
  • భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు
  • ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో చెప్పాలి
  • ఈనెల 8 నుంచి 15 వరకు 'ప్రజా వంచన వారం' నిర్వహిస్తాం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ నిర్మాణ దీక్షల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని టీడీపీ ప్రచారానికి వాడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రజలకు అసత్యాలు చెబుతూ వారి భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు ఆయన నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నారని అన్నారు.

నవనిర్మాణ దీక్షపై మండిపడుతూ విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయం నుంచి రఘువీరారెడ్డి ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. నవ నిర్మాణ దీక్షల పేరిట టీడీపీ ప్రచారానికి ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రావతరణ దినోత్సవం లేకుండా చేసిన ఘనత చంద్రబాబుదేనని, ప్రభుత్వం ఇప్పటికైనా నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవంగా జరపాలని అన్నారు. టీడీపీ నాలుగేళ్ల పాలనపై ఈనెల 8 నుంచి 15 వరకు తాము 'ప్రజా వంచన వారం' నిర్వహిస్తామని తెలిపారు.   

raghuveera reddy
Congress
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News