Chandrababu: 4 మిలియన్లకు చేరిన చంద్రబాబు ట్విట్టర్‌ ఖాతా ఫాలోవర్లు.. హర్షం వ్యక్తం చేసిన సీఎం

  • 2009 అక్టోబర్‌లో ట్విట్టర్‌ ఖాతా తెరిచిన చంద్రబాబు
  • తన పర్యటన వివరాలను అధికంగా పోస్ట్ చేసిన సీఎం
  • ట్విట్టర్‌ ద్వారా సూచనలు ఇస్తోన్న వారికి ధన్యవాదాలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ట్విట్టర్‌ ఖాతా ఫాలోవర్ల సంఖ్య నాలుగు మిలియన్లకు చేరింది. దక్షిణాదిలో ఏ నేతకూ లేనంతగా ఆయన ఫాలోవర్లను సంపాదించుకున్నారు. టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటారన్న పేరు తెచ్చుకున్న చంద్రబాబు 2009 అక్టోబర్‌లో ట్విట్టర్‌ ఖాతా తెరిచారు. తన పర్యటన వివరాలు, వీడియోలు, తమ ప్రభుత్వం చేపడుతోన్న కార్యక్రమాలను ఆయన అధికంగా పోస్ట్ చేస్తారు.

తన ట్విట్టర్‌ ఖాతాను నాలుగు మిలియన్ల మంది అనుసరిస్తున్నందుకు ఆనందంగా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. ట్విట్టర్‌ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ స్పందించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.                                                          

Chandrababu
Andhra Pradesh
Chief Minister
  • Loading...

More Telugu News