rbi: రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా ఎంకే జైన్ నియామకం
- మూడేళ్ల పాటు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా జైన్
- ఐడీబీఐ బ్యాంక్ ఎండీ, సీఈవోగా పనిచేసిన అనుభవం
- గతేడాది జులై నుంచి ఖాళీగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పోస్ట్
ఐడీబీఐ బ్యాంక్ ఎండీ, సీఈవోగా పనిచేసిన మహేశ్ కుమార్ జైన్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా గతేడాది జులై వరకు ఎస్‌ఎస్ ముంద్రా పని చేశారు. ఆయన పదవీకాలం ముగిసినప్పటినుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది.
ఇందుకోసం ఇంటర్వ్యూలు చేసిన ఆర్‌బీఐ జైన్‌ను ఎంపిక చేసి ప్రకటన చేసింది. బ్యాంకింగ్ రంగంలోకి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఉద్యోగిగా ప్రవేశించిన జైన్.. గతంలో సిండికేట్ బ్యాంక్‌లో జనరల్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పని చేశారు.