Undavalli: శవాలను రాష్ట్రమంతా తిప్పిన ఘనత మోదీది:ఉండవల్లి

  • జైట్లీ లాంటి దగుల్బాజీ ఆర్థికమంత్రి లేడు
  • బ్యాంకుల్లో డబ్బుల్లేకపోవడం ఇప్పుడే చూస్తున్నా
  • ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చ జరగాలి

అరుణ్ జైట్లీలాంటి దగుల్బాజీ కేంద్ర ఆర్థికమంత్రిని మనమెప్పుడైనా చూశామా? అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్లు చలామణిలో లేవని... 2019 ఎన్నికల కోసం రాజకీయ నాయకులు పెద్ద నోట్లను తమవద్ద దాచేసుకున్నారని, అందుకే ఏటీఎంలలో డబ్బు లేకుండా పోయిందంటూ అరుణ్ జైట్లీ మాట్లాడటం దారుణమని అన్నారు. ఇన్నేళ్ల జీవితకాలంలో బ్యాంకుల్లో డబ్బు లేకపోవడం ఇప్పుడే చూస్తున్నానని ఎద్దేవా చేశారు.

ప్రధాని మోదీ చాలా దారుణమైన వ్యక్తి అని విమర్శించారు. గోద్రా అల్లర్లలో చనిపోయిన వ్యక్తుల శవాలను మొత్తం రాష్ట్రమంతా తిప్పిన ఘనత మోదీదని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యూహాల వెనుక ఉన్నది అమిత్ షా అని అన్నారు. ఇప్పుడు ఏపీకి తీరని అన్యాయం జరుగుతోందని... ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో చర్చ జరగకపోతే రాష్ట్రం మరింత నష్టపోతుందని చెప్పారు. మోదీ తనను చంపేస్తాడేమోననే భయం చంద్రబాబుకు పట్టుకుందని అన్నారు.

Undavalli
Chandrababu
modi
amit shah
  • Loading...

More Telugu News